Guntur: చిగులూరులో క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించిన జెసి!
Guntur: గుంటూరు జిల్లా కొల్లిపర మండలం చిగులూరు గ్రామంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి, ధాన్యం సేకరణపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Guntur: చిగులూరులో క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించిన జెసి!
గుంటూరు: కొల్లిపర మండలం చిగులూరు గ్రామంలో క్షేత్రస్థాయిలో పంటలను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పరిశీలించారు. కోతలకు వచ్చిన పంటల పరిస్థితి వాటిని నూర్పిడి చేసే విధానం తదితర అంశాలను స్థానిక రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణ కేంద్రాల ఏర్పాటు పరిస్థితులను ఈ సందర్భంగా గమనించారు.
ధాన్యం సేకరణ కేంద్రాల ఏర్పాటుకు గల అవకాశాలపై పౌర సరఫరాల సంస్థ అధికారులకు ఆదేశించారు. ధాన్యం సేకరణకు మార్గదర్శకాలు ఉండే విధానాన్ని రైతులకు వివరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులు ఎటువంటి పరిస్థితుల్లోనూ నష్టపోరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర విధిగా రైతులకు వచ్చే విధంగా అవగాహన కల్పించాలని చెప్పారు.
అందుకు ధాన్యం ఆరబెట్టే విధానం, ధాన్యంలో తేమశాతం తక్కువగా ఉండుటకు చేపట్టాల్సిన చర్యలను వివరించాలని అన్నారు. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు రైతులు విక్రయించకుండా సూచనలు సలహాలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి, డీ.సీ.ఎం.ఎస్ అధికారి రవీంద్రబాబు, కొల్లిపర తాసిల్దార్, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.




