Guntur: జీఎస్టీ ఆదాయాల పెంపునకు సమన్వయంతో పనిచేయాలి: జేసీ!
Guntur: గుంటూరు జిల్లాలో జీఎస్టీ ఆదాయాల పెంపునకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ శుక్రవారం ఆదేశించారు.
Guntur: జీఎస్టీ ఆదాయాల పెంపునకు సమన్వయంతో పనిచేయాలి: జేసీ!
గుంటూరు: గుంటూరు జిల్లాలో జీఎస్టీ ఆదాయాల పెంపునకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జీఎస్టీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జీఎస్టీ జాయింట్ కమిషనర్లు గీత, సమావేశం నిర్వహణ ఉద్దేశ్యాలను, జీఎస్టీ ఆదాయాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. గుంటూరు-1, గుంటూరు-2 సర్కిళ్ల పరిధిలో వస్తున్న జీఎస్టీ ఆదాయాలపై సమావేశంలో సమీక్షించి చర్చించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల శాఖ, మున్సిపల్ శాఖలకు సంబంధించి ప్రతి నెలా చెల్లించే టీడీఎస్ వివరాలను సంబంధిత అధికారులు తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు.
ఆయా శాఖల పరిధిలోని పన్నుల వసూళ్లు, ఆదాయ వివరాలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, జీఎస్టీ ఆదాయాల పెంపునకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, జిల్లా రిజిస్ట్రార్ శైలజ, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




