Guntur: గుంటూరులో పేదలకు 2 సెంట్ల స్థలం ఇవ్వాలి: సీపీఐ ధర్నా
Guntur: గుంటూరులో పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం, ₹5 లక్షల నిర్మాణ సాయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ చేపట్టిన కలెక్టరేట్ ధర్నాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Guntur: గుంటూరులో పేదలకు 2 సెంట్ల స్థలం ఇవ్వాలి: సీపీఐ ధర్నా
గుంటూరు: గుంటూరు నగరంలోని అర్హులైన నిరుపేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా విజ్ఞాపన ధర్నా నిర్వహించారు.
సీపీఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పేదలకు ఇంటి స్థలాలు, టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడం, దశాబ్దాలుగా ఇళ్లలో నివసిస్తున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి ముఖ్యఅతిథిగా, జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, ఏఐటియుసి రాష్ట్ర నాయకులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా విజ్ఞాపన ధర్నాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అర్హులైన పేద ప్రజలు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు.
దీంతో అర్జీదారులు బారికేడ్లను సైతం లెక్కచేయకుండా పోలీసులను నెట్టుకుంటూ కలెక్టరేట్‌లోకి వెళ్లారు. తమకు 2 సెంట్ల ఇంటి స్థలం కేటాయించి, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని వారు డిమాండ్ చేశారు.




