Guntur: ఘనంగా మహాకవి గుర్రం జాషువా 131వ జయంతి వారోత్సవాలు
Guntur: గుంటూరులో సెప్టెంబర్ 22 నుంచి గుర్రం జాషువా 131వ జయంతి వారోత్సవాలు. వివరాలు వెల్లడించిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్.
Guntur: ఘనంగా మహాకవి గుర్రం జాషువా 131వ జయంతి వారోత్సవాలు
గుంటూరు: నవ యువ కవి చక్రవర్తి గుర్రం జాషువా 131 వ జయంతి వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు.
గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
సెప్టెంబర్ 22వ తారీకు నుండి 28 వరకు గుంటూరులో పెద్ద ఎత్తున గుర్రం జాషువా కళాపేట ఆధ్వర్యంలో ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 22వ తేదీ జాషువా పద్యానికి పట్టాభిషేకం కార్యక్రమం బృందావన గార్డెన్ లోని అన్నమయ్య కళావేదికలో జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా గరికపాటి నరసింహారావు కుమారుడు గరికపాటి గురజాడ హాజరుకానున్నట్లు వెల్లడించారు. 23వ తేదీ జాషువా సాహిత్యం సామాజిక సంస్కరణ.. అన్నమయ్య కళ వేదికగా జరుగుతుందన్నారు. 24వ తేదీ నగరంపాలెంలోని గుర్రం జాషువా విగ్రహం వద్ద జాషువా సాహిత్యం జీవితపై వక్తలు ప్రసంగిస్తారని తెలిపారు.
25వ తేదీ జాషువా విగ్రహం వద్ద క్రీస్తు చరిత్రకండకావ్యం.. 26వ తారీకు జాషువా సాహిత్యంలో స్త్రీ పాత్రపై వక్తలు ప్రసంగిస్తారని తెలిపారు. 28వ తేదీ.. చివరి రోజు రాష్ట్ర ప్రభుత్వం జాషువా జయంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహిస్తారని తెలియజేశారు. మహాకవి జాషువ జయంతి వారోత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయవలెనని పిలుపునిచ్చారు.




