Guntur: స్థానిక ఎన్నికలు గుంటూరులో పోలింగ్ కేంద్రాల తనిఖీకి ఆదేశాలు
Guntur: గుంటూరులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులతో సమీక్షించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతకు ఆదేశాలు.
Guntur: స్థానిక ఎన్నికలు గుంటూరులో పోలింగ్ కేంద్రాల తనిఖీకి ఆదేశాలు
గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలతో తనిఖీ చేయించి సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా విభజించి, సదరు ప్రాంతాలలో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని నగర కమిషనర్ మరియు అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు.
సోమవారం నగర పాలక సంస్థలోని కమిషనర్ ఛాంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి నగరంలోని డియస్పిలు, తహసిల్దార్లు, నగర పాలక సంస్థ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రానున్నదని, సదరు ఎన్నికల నిర్వహణకు అన్ని శాఖలు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నగర పాలక సంస్థ పరిధిలో పోలింగ్ నిర్వహించుటకు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయుట జరిగిందని, సదరు పోలింగ్ స్టేషన్ల పరిధిలో జోనల్ అధికారులు, యస్.హెచ్.ఓలు మరియు టిపిబిఓలతో ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి, పోలింగ్ స్టేషన్ల పరిధిలో పర్యటించి, సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించి, సదరు ప్రాంతాలలో అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగు ప్రాంతాలలో మరియు స్ట్రాంగ్ రూమ్ ల వద్ద అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలలో పాల్గొనే అభ్యర్ధులకు ఎన్నికల ప్రచారానికి, ర్యాలీలకు మరియు సమావేశాలకు అవసరమైన అనుమతులు ఇవ్వటానికి సింగల్ విండో విధానాన్ని ఏర్పాటు చేసి, అభ్యర్ధులకు అవసరమైన అన్ని అనుమతులు త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎన్నికల సందర్భంగా నగరంలో ఆర్.ఓ ఆఫీస్ లను ఏర్పాటు చేస్తున్నామని, ఎన్నికలలో పాల్గోనే అభ్యర్ధులు నామినేషన్లను వేయడానికి ఆర్.ఓ ఆఫీస్ లకు వస్తారని, కావున ఆర్.ఓ ఆఫీస్ ల వద్ద ఎన్నికల నిబంధనల ప్రకారం అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తరువాత (యంసిసి) మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ ను పక్కాగా అమలు చేయడానికి బృందాలను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశం నందు అదనపు కమిషనర్లు ఐ. కిషోర్, జి. రవీంద్ర, డి.యస్.పిలు సీతారాం, శ్రీనివాసరావు, పూర్ణచంద్ర రావు, డి.సిలు బి. శ్రీనివాసరావు, సాంబశివరావు, సి.హెచ్ శ్రీనివాస్, డి.సి.పి సూరజ్ కుమార్, తహసిల్దార్లు కిరణ్, సుబాని, డిప్యూటీ తహసిల్దార్ నాగమల్లెస్వర రావు పాల్గొన్నారు.




