Nandivelugu: నందివెలుగు వంతెన పనులు వేగవంతం చేయాలి: కమిషనర్ మయూర్ అశోక్

Nandivelugu: గుంటూరు నందివెలుగు రోడ్డులోని ఆర్‌ఓబీ నిర్మాణ పనులను కమిషనర్ కె.మయూర్ అశోక్ పరిశీలించారు; నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 6 Oct 2026 5:24 PM IST
Nandivelugu
X

Nandivelugu: నందివెలుగు వంతెన పనులు వేగవంతం చేయాలి: కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు: నందివెలుగు రైల్వే వంతెన పనులను రోజువారీ లక్ష్యానికి అనుగుణంగా వేగంగా చేపట్టాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కాంట్రక్టర్ ని ఆదేశించారు. రైల్వే, జిఎంసి, ఆర్&బి అధికారులతో కలిసి నందివెలుగు రోడ్ లోని ఆర్ఓబి నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వంతెన పనులను నిర్దేశిత రోజువారీ లక్ష్యానికి తగిన విధంగా జరిగేలా ప్రణాళికాబద్దంగా కృషి చేయాలన్నారు. పనుల్లో భాగంగా ట్రాఫిక్ నియంత్రణకు, పనుల నిమిత్తం రైల్వే గేట్‌ను రెండు రోజుల పాటు మూసివేసి పనులు పూర్తి చేయడానికి రైల్వే, ట్రాఫిక్, జిఎంసి అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఇప్పటికే వంతెన ప్రారంభానికి గడువు నిర్దేశించినందున అందుకు తగిన విధంగా కాంట్రాక్టర్ అదనపు సిబ్బందిని, కార్మికులను కేటాయించుకొని, పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

పర్యటనలో జిఎంసి సిటి ప్లానర్ రాంబాబు, ఈఈ సుందర్రామిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN