Guntur: నామినేషన్లు, ర్యాలీలకు ముందస్తు పోలీసు అనుమతి తప్పనిసరి!
Guntur: గుంటూరులో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు, అభ్యర్థులు సహకరించాలని ఈస్ట్ డీఎస్పీ సీతారాం కోరారు.
Guntur: నామినేషన్లు, ర్యాలీలకు ముందస్తు పోలీసు అనుమతి తప్పనిసరి!
Guntur: ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి ఈస్ట్ DSP సీతారాం కామెంట్స్ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు, అభ్యర్థులు పోలీసులకు సహకరించాలి. నామినేషన్ల సమయంలో ర్యాలీలు, డీజేలకు ముందస్తు పోలీసు అనుమతి తీసుకోవాలి.
సబ్డివిజన్ పరిధిలో అమలులో ఉన్న ఆంక్షలను పాటించాలని, ర్యాలీలు, బహిరంగ సమావేశాల విషయంలో పోలీసుల నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఓట్ల లెక్కింపు కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో అభ్యర్థులు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుంది.
ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులకు సహకరించాలి.




