Guntur: పీడీఎస్ విధానంలో క్యూ ఆర్ కోడ్ కీలకం గుంటూరు డీఎస్ఓ!

Guntur: ప్రజా పంపిణీ వ్యవస్థలో క్యూ ఆర్ కోడ్ కీలకమని గుంటూరు డీఎస్ఓ పి. కోమలి పద్మ అన్నారు. ప్రత్తిపాడులో చౌక ధరల దుకాణాలను పరిశీలించి డీలర్లకు అవగాహన కల్పించారు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 29 Sept 2026 1:49 PM IST
Guntur
X

Guntur: పీడీఎస్ విధానంలో క్యూ ఆర్ కోడ్ కీలకం గుంటూరు డీఎస్ఓ!

Guntur: గుంటూరుపౌర సరఫరాల శాఖ పంపిణీ చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ (పి.డి.ఎస్) లో క్యూ ఆర్ కోడ్ కీలక పాత్ర వహిస్తుందని జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ అన్నారు. క్యూ ఆర్ కోడ్ అమలు, తదితర అంశాలను ప్రత్తిపాడు ఎం.ఎల్.ఎస్ పాయింట్ తో పాటు పలు చౌక ధరల దుకాణాలలో డి.ఎస్.ఓ మంగళవారం పరిశీలించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో నాలుగు మండలాల డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డీలర్లకు క్యూ ఆర్ కోడ్ విధానంపై అవగాహన కలిగించారు.

పి.డి.ఎస్ మరింత పారదర్శకంగా పని చేయుటకు నూతనంగా ప్రవేశపెట్టిన క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ విధానంలో డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను నివృతి చేశారు. చౌక ధరల దుకాణాలలో పంపిణీ విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సి.ఎస్ డి.టి తదితరులు పాల్గొన్నారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU