Guntur: కమ్యూనిటీ మధ్యవర్తులకు శిక్షణ: గుంటూరు డీఎల్‌ఎస్ఏ
Guntur: వ్యాజ్యాలు లేని గ్రామీణ భారతమే లక్ష్యంగా గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కమ్యూనిటీ మధ్యవర్తులకు రెండు రోజుల శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి.
Guntur: కమ్యూనిటీ మధ్యవర్తులకు శిక్షణ: గుంటూరు డీఎల్‌ఎస్ఏ
గుంటూరు: జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు వ్యాజ్యాలు లేని గ్రామీణ భారతదేశం పై జరిగే రెండు రోజుల శిక్షణా కార్యక్రమం లో భాగంగా గుంటూరు జిల్లా లోని కమ్యూనిటీ మధ్యవర్తులకు శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారిచే నియమింపబడిన ప్రధాన శిక్షకుడు ఎస్ . అరుణాచలం ,ఒకటవ అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు ఇంచార్జి చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శ్రీమతి వి.ఎ.ఎల్ సత్యవతి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాద్దీన్ జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు .
ఈ కార్యక్రమంలో భాగంగా ఒకటవ అదనపు జిల్లా జడ్జి మరియు ఇంచార్జి చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శ్రీమతి వి.ఎ.ఎల్ సత్యవతి మాట్లాడుతూ కమ్యూనిటీ మధ్యవర్తులుగా కేసులను రాజీ చేయడంలో మీ పాత్ర చాల ముఖ్యమైందని ఒక కుటుంబం మంచిది అనిపించుకోవాలంటే ఆ కుటుంబంలోని వ్యక్తులందరూ కష్టపడాలని అదే కుటుంబం చెడ్డది అనిపించుకోవాలంటే ఒక వ్యక్తి ప్రవర్తన చెడుగా ఉన్న ఆ కుటుంబం మొత్తానికి చెడ్డపేరు వస్తుందని అలాగే ఒక సంస్థకి కూడా మీరు అలాంటి వారేనని కాబట్టి మధ్యవర్తితం ద్వారా మీ గ్రామంలో రాజీ పడదగ్గ విషయాలలో మీ వంతు బాధ్యతగా కృషి చేయాలని అన్నారు మరియు వారికి తగు సలహాలు సూచనలు ఇచ్చారు .
ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ కమ్యూనిటీ మధ్యవర్తి అంటే గ్రామాలలో ఎదురయ్యే సమస్యలకు కేవలం ఒక కుటుంబానికి కానీ లేదా ఒక వ్యక్తి తరపునే మాట్లాడటం కాదని ఇరుపక్షాల వాదనలు , సమస్యలు తెలుసుకొని ఎవరో ఒకరిని గెలిపించడం కాకుండా ఇరు పక్షాల మధ్య శాంతిని తిరిగి తీసుకువచ్చే విధంగా కృషి చేయాలనీ అన్నారు.
కమ్యూనిటీ మధ్యవర్తులందరూ సమాజానికి శాంతి దూతలలాంటివారని ప్రజల మధ్య వివాదాలు వచ్చినపుడు సాధ్యమైన చోట ముందుగా సంభాషణకు, పరస్పర అవగాహనకు , శాంతియుత పరిష్కారానికి అవకాశం కల్పించాలని మరియు ఇతరుల బాధలను అర్ధం చేసుకునే మనస్సు , ఓపిక , నిజాయితీ ఉండాలని ప్రజలు మీ మాటలను నమ్మి వారి సమస్యలను మీతో చెప్పుకునే విధంగా ఉండాలని మరియు వారి సమస్యలను మీరు రహస్యంగా ఉంచుతారనే నమ్మకం ప్రజలకు కలిగించాలని అన్నారు.
మరియు మధ్యవర్తి యొక్క పని సమస్యకు తీర్పు చెప్పడం కాదని వారి మధ్య ఉన్న అపార్ధాలను తొలగించాడనికి ప్రయత్నించాలని సమస్యకు పరిష్కారం ఏమిటో వారే గుర్తించే విధంగా కృషి చేయాలని అన్నారు. వ్యాజ్యాలు లేని గ్రామీణ భారతదేశం అనే లక్ష్యమే ప్రధాన ఆలోచనగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మధ్యవర్తులుగా తప్పనిసరిగా పాటించవలసిన ముఖ్యమైన విషయాల గురించి మధ్యవర్తులకు వివరించారు.
ఈ శిక్షణ ద్వారా సమస్యలను ఎలా వినాలి ,కోపంలో ఉన్న వారిని ఎలా శాంతపరచాలి ,ఎప్పుడు సంబంధిత అధికారులకు పంపించాలి అనే విషయాలను నేర్చుకోవాలని అన్నారు. శిక్షణ తీసుకోవడం మీ మొదటి అడుగు మాత్రమే అని గ్రామాలకు వెళ్లిన తరువాత శిక్షణలో నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన ప్రయోజనం కనిపిస్తుందని అన్నారు. మీరందరూ సమాజానికి సేవ చేయాలనీ ఆశిస్తూ గొడవలు తగ్గి సంబంధాలు నిలబడేలా కృషిచేయాలని మధ్యవర్తులకు సూచించారు.
తదనంతరం ప్రధాన శిక్షకులు ఎస్ . అరుణాచలం కమ్యూనిటీ మధ్యవర్తులు శిక్షణ ప్రారంభించారు వారికి మధ్యవర్తిత్వం పై సివిల్ మరియు క్రిమినల్ కేసులలో తగు ఉదాహారణలతో శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మీడియేటర్ వసుమతి పూర్ణిమ , మీడియేటర్ రామ్ ,జిల్లా లోని కమ్యూనిటీ మధ్యవర్తులు పాల్గొన్నారు.




