Guntur: గుంటూరు జిల్లా పోలీసు నూతన లోగో ఆవిష్కరణ!

Guntur: గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నూతన జిల్లా పోలీసు లోగోను ఆవిష్కరించారు. ఇకపై సిబ్బంది ఈ లోగోను ధరించాలని ఆదేశించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 7 Oct 2026 5:24 PM IST
Guntur
X

Guntur: గుంటూరు జిల్లా పోలీసు నూతన లోగో ఆవిష్కరణ!

Guntur: గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లాలోని ఆరు సబ్‌డివిజన్ల డీఎస్పీలు మహిళ పీస్ డీస్పీ, సీసీఎస్ డీస్పీ లతో కలిసి గుంటూరు జిల్లా పోలీసు లోగోను ఆవిష్కరించారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ఇకపై జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఈ లోగోను ధరించాలని సూచించారు. ఈ లోగో గుంటూరు జిల్లా పోలీసులకు ప్రత్యేక గుర్తింపును కల్పించడంతో పాటు, ప్రజల్లో జిల్లా పోలీసు వ్యవస్థపై అవగాహనను పెంపొందించేందుకు దోహదపడుతుందని అన్నారు. గుంటూరు జిల్లాకు ప్రత్యేకమైన పోలీసు లోగోను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని ఎస్పీ మరియు డీఎస్పీలు పేర్కొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN