Guntur: అల్పపీడనం పట్ల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్!

Guntur: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా బలపడే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 13 Nov 2026 8:54 PM IST
Guntur
X

Guntur: అల్పపీడనం పట్ల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్!

గుంటూరు: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పట్ల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాయవ్య దిశగా పయనించి శనివారం సుస్పష్టమైన అల్పపీడనంగా, ఆదివారం ఉదయానికి అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు.

తదుపరి ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ సోమవారం సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని ఆర్.టి.జి.ఎస్ సూచనలు జారీ చేసిందని చెప్పారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల రీత్యా ప్రజలు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పంటలు నష్టపోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ అధికారులు సూచనలు, సలహాలు అందించాలని ఆదేశించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN