Tadikonda: చీకటి గోపి లాకప్‌డెత్: కారకులను అరెస్ట్ చేయాలి

Tadikonda: తాడికొండ లాకప్‌డెత్ బాధితుడు చీకటి గోపి మరణానికి కారకులైన పోలీసులను అరెస్ట్ చేయాలని, రీ-పోస్టుమార్టం జరపాలని ఎస్పీ వకుల్ జిందాల్‌ను దళిత నేతలు డిమాండ్ చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 5 Oct 2026 6:52 PM IST
Tadikonda
X

Tadikonda: చీకటి గోపి లాకప్‌డెత్: కారకులను అరెస్ట్ చేయాలి

గుంటూరు జిల్లా: తాడికొండ పోలీస్ స్టేషన్లో చీకటి గోపి అను దళిత యువకుడి లాకప్ డెత్ ఘటనలో సిట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని పోలీస్ వైఫల్యం వాస్తవమేనని జిల్లా ఎస్పీ ఓకుల్ జిందాల్ దళిత నాయకులతో జరిగిన సమావేశంలో ఒప్పుకున్నారు.

సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఓకుల్ జిందాల్ను కలిసి తాడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నెకల్లు గ్రామంలో ఆటో డ్రైవర్గా జీవిస్తున్న చీకటి గోపి అనే దళిత యువకుడిని తాడికొండ సిఐ ఉమేష్, ఎస్సై జ్యోతి, మురళి అనే కానిస్టేబుల్ కొట్టి చంపిన విషయం పై దళితుల ఆందోళనలతో గుంటూరు జిల్లా ఎస్పీ ఓకుల్ జిందాల్ ఏ ఎస్ పి రవికుమార్ డి.ఎస్.పి మరో ఇద్దరు సీఐ లతో కలిపి సిట్ ఏర్పాటు చేశారు.

చింతజల్లు గోపి అను మాదిగ యువకుడు నెల్లూరు ప్రసాద్ అను తెలుగుదేశం నాయకుడి ఉంగరాన్ని తీసుకొని కుదవ పెట్టుకొనగా చీకటి గోపి అను మరో మాల ఆటో డ్రైవర్ను తాడికొండ పోలీసులు చిత్రహింసలు పెట్టి హంటర్ తో కొట్టి నేల మీద కూర్చోబెట్టి బూట్ కాలుతో పురుషాంగం పై తన్న టం వలన జ్వరం వచ్చి రెండు రోజులు తర్వాత గుంటూరు హాస్పిటల్ లో గత నెల ఒకటవ తేదీన మరణించాడన్నారు.

తాడికొండ సీఐ ఉమేష్ తో పాటు చీకటి గోపీని చావగొట్టిన వారిలో తెనాలిలొ ముగ్గురు దళిత యువకులను సీఐ రాములు నాయక్ తో పాటు లాఠీ లతో కొట్టిన మురళి ప్రధాన కారకుడు అన్నారు.

ఈ విషయం బయట వారికి చెబితే గంజాయి కేసు పెడతామని దొంగ బంగారం కేసు పెడతామని బెదిరించడంతో చింతజల్లు గోపి అను మాదిగ యువకుడు పారిపోయాడన్నారు. ఇటీవల చింతజలు గోపి ప్రత్యక్ష సాక్షి చెప్పిన సాక్ష్యం ప్రకారం వెంటనే BNS 103 ఎస్సీ ఎస్టీ యాక్ట్ తాడికొండ సీఐ ఉమేష్ తదితరులపై కేసు మార్చవలసిందన్నారు.

పోస్టుమార్టం రిపోర్టు కూడా తాడికొండ అధికారులు మేనేజ్ చేశారనే అనుమానం తమకుందని చీకటి గోపి శవాన్ని రీ పోస్టుమార్టం చేయించాలని దళిత నాయకులు జిల్లా ఎస్పీని డిమాండ్ చేశారు.

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గాదే సాయి కృష్ణ అను 22 కేసులు ఉన్న కాపు యువకుడు రౌడీ షీటర్ ను సీఐ నాగరాజు చంపాడనే ఆరోపణతో శవం ఆచూకీ లేకపోయినా జనసేన నాయకులను సంతృప్తి పరచటానికి సీఐ నాగరాజును కానిస్టేబుళ్లను అరెస్టు చేసి జైలుకు పంపించారన్నారు.

అలాగే క్రాంతి మాదిగ కేసులో కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తమ డిమాండ్తో అదే కృష్ణలంక సీఐ నాగరాజు మీద బలన్మరణం మరియు ఎస్సీ ఎస్టీ కేసుగా మార్పు చేశారని గుంటూరు జిల్లా ఎస్పీ ఓకుల్ జిందాల్ కు వివరించారు.

సిట్ రిపోర్టు రాగానే సెక్షన్లు మారుస్తామని చీకటి గోపి మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ దళిత నాయకులకు హామీ ఇచ్చారు.

గుంటూరు జిల్లా ఎస్పీని కలిసిన వారిలో మంద కృష్ణ మాదిగ, కొరివి వినయ్ కుమార్, నీలం నాగేంద్రరావు, నీలాంబరం, శిఖ సురేష్, బత్తుల వీరాస్వామి, దారా అంజయ్య తదితరులున్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN