Guntur: 'అర్నబ్' తుఫాను వేళ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు!

Guntur: 'అర్నబ్' తుఫాను ప్రభావంతో గుంటూరు కలెక్టరేట్‌లో 24/7 కంట్రోల్ రూమ్ (0863-2234014) ఏర్పాటు. సిబ్బంది షిఫ్టుల వివరాలు వెల్లడించిన కలెక్టర్ సాయికాంత్ వర్మ.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 26 Oct 2026 7:23 PM IST
Guntur
X

Guntur: 'అర్నబ్' తుఫాను వేళ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు!

గుంటూరు: అర్నాబ్ తుఫాను దృష్ట్యా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. అర్నాబ్ తుఫానుపై రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాను ను ఎదుర్కొనుటకు జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని తెలిపారు.

అన్ని శాఖలను అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పారు. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సమాచారాన్ని తెలుసుకుంటకు, ప్రజలు మన సమస్యలను తెలియజేయుటకు జిల్లా కలెక్టర్ కార్యాలయం తో పాటు డివిజనల్ కార్యాలయాల్లోనూ మండల కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 08632234014 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అన్నారు. రేయింబవళ్ళు పర్యవేక్షణకు సిబ్బందిని నియమించడం జరిగిందని చెప్పారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వి.శ్రీనివాసరెడ్డి (9966990479), సి.హెచ్. శ్రీనివాసరావు ( 9290402095)., మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కె.ఎస్.ఎన్.ఆర్ ప్రసాద్ ( 9030046634), ఎన్.పుల్లారావు (9908593919)., రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కె.విజయ కార్తీక్ (8328434159), పి. ప్రణయ్ కుమార్ (9493347430) విధుల్లో ఉంటారని అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN