Guntur: గుంటూరులో కార్డన్ సెర్చ్: 26 అనుమానాస్పద వాహనాలు స్వాధీనం!
Guntur: గుంటూరు కొత్తపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 26 అనుమానాస్పద వాహనాలను స్వాధీనం చేసుకుని, రౌడీషీటర్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Guntur: గుంటూరులో కార్డన్ సెర్చ్: 26 అనుమానాస్పద వాహనాలు స్వాధీనం!
Guntur: గుంటూరు నగరంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సబ్ డివిజన్ పోలీసు ఉన్నతాధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేశ్వరరావు కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ తనిఖీల్లో 26 అనుమానాస్పద ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ టి. సీతారాం మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఎవరైనా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే కేసులు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలిస్తామని స్పష్టం చేశారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, అలవాట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. తమ కాలనీల్లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉంటే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని లేదా అత్యవసర పోలీస్ సహాయం కోసం 112 నంబర్కు కాల్ చేయాలని డీఎస్పీ టి. సీతారాం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




