Guntur: వరల్డ్ మేయర్స్ ఫోరంలో CITYNETతో గుంటూరు కమిషనర్ భేటీ

Guntur: ముంబై 3వ వరల్డ్ మేయర్స్ ఫోరంలో CITYNET ప్రతినిధులతో గుంటూరు కమిషనర్ మయూర్ అశోక్ భేటీ; వ్యర్థాల నిర్వహణ, పట్టణాభివృద్ధి అంశాలపై చర్చ.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 27 Nov 2026 9:31 PM IST
Guntur
X

Guntur: వరల్డ్ మేయర్స్ ఫోరంలో CITYNETతో గుంటూరు కమిషనర్ భేటీ

గుంటూరు: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ శతాబ్ది ఉత్సవాల (1926–2026) సందర్భంగా ముంబైలోని ఫెయిర్‌మాంట్ హోటల్‌లో నవంబర్ 25 నుండి 27, 2026 వరకు నిర్వహిస్తున్న ‘3వ వరల్డ్ మేయర్స్ ఫోరం’ 3వ రోజు ఆంధ్రప్రదేశ్ స్వచ్చాంద్ర కార్పోరేషన్ చైర్మన్ కె.పట్టాభిరామ్, ఇతర కార్పొరేషన్ల కమిషనర్లతో కలిసి గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ CITYNET ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నగరాల మధ్య పరస్పర సహకారం, పట్టణ వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛత మరియు సుస్థిర పట్టణాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకుని చర్చించారు.

ఈ అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాల మేయర్లు, పట్టణ పాలనా నిపుణులు, విధాన నిర్ణేతలు పాల్గొని ఆధునిక నగరాల భవిష్యత్తుపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా 2047 నాటికి నగరాల పునరాకృతి, కృత్రిమ మేధ ఆధారిత పట్టణ పాలన, పట్టణ వ్యర్థాల నిర్వహణ, సర్క్యులర్ ఎకానమీ, వాతావరణ స్థితిస్థాపకత, సుస్థిర పట్టణ రవాణా, మెట్రోపాలిటన్ గవర్నెన్స్ మరియు ఇంధన పరివర్తన వంటి అంశాలతో పాటు మహిళా నాయకత్వం, లింగ సమానత్వం మరియు ఆర్థిక చేరికపై ప్రత్యేక వర్క్‌షాప్ వంటి అంశాలు ఈ ఫోరం వేదికగా చర్చకు వచ్చాయి.

అంతర్జాతీయ వేదికపై లభించిన ఉత్తమ విధానాలు మరియు నూతన ఆలోచనలను గుంటూరు నగరంలో పారిశుద్ధ్య మెరుగుదల, మౌలిక సదుపాయాల బలోపేతం మరియు సమర్థవంతమైన పట్టణ సేవల అమలుకు వినియోగించుకునే దిశగా కృషి చేస్తామని నగర మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, కమిషనర్ కె.మయూర్ అశోక్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN