Guntur: శంకర్ విలాస్ ROB పనులు వేగవంతం చేయాలి: కమిషనర్ మయూర్ అశోక్!

Guntur: గుంటూరు శంకర్ విలాస్ ఆర్‌వోబీ పనులపై కమిషనర్ మయూర్ అశోక్, జేసీ ఆశుతోష్ శ్రీవాస్తవ భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 14 Oct 2026 6:28 PM IST
Guntur
X

Guntur: శంకర్ విలాస్ ROB పనులు వేగవంతం చేయాలి: కమిషనర్ మయూర్ అశోక్!

Guntur: శంకర్ విలాస్ ఆర్ఓబి పనులను వేగంగా చేపట్టడానికి ఆర్&బి అధికారులు, కాంట్రాక్టర్, జిఎంసి అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవతో కలిసి, రెవెన్యూ, ఆర్అ&బి, జిఎంసి అధికారులతో సంయుక్త సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆర్ఓబి పనుల వేగవంతం కోసం ప్రకటించిన భూ సేకరణ ప్రక్రియని త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. భూ సేకరణలో రెవెన్యూ అధికారులకు జిఎంసి నుండి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.

కోర్ట్ కేసుల వారీగా సమీక్షించి, తగిన వివరాలతో ఎప్పటికప్పుడు కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ ప్రతినిధులతో మాట్లాడుతూ, పనులను రోజువారీ లక్ష్యానికి అనుగుణంగా చేపట్టాలని, అందుకు తగిన సంఖ్యలో కార్మికులను, ఇతర యంత్ర సామాగ్రిని సిద్దం చేసుకోవాలన్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ పోలీస్ వారితో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.

సమావేశంలో ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ డి.రాంబాబు, ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, ఆర్&బి డిఈఈ రాజేంద్రనాయుడు, పశ్చిమ తహశీల్దార్ కిరణ్ కుమార్, ఆర్ఓబీ కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN