Guntur: గుంటూరులో ఎన్నికల కోడ్ అమలు పారదర్శకంగా ఎన్నికలు జరపాలి
Guntur: గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలు 15 రోజుల్లో పూర్తికానున్నాయని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సమర్థవంతంగా అమలు చేయాలని కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశించారు.
Guntur: గుంటూరులో ఎన్నికల కోడ్ అమలు పారదర్శకంగా ఎన్నికలు జరపాలి
గుంటూరు: గుంటూరు నగర పాలక సంస్థకు జరగనున్న ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్ఓ) ల పై ఉందని నగర కమిషనర్ మరియు అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె. మయూర్ అశోక్ తెలిపారు.
బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల విధుల కేటాయించబడిన ఆర్ఓలు, ఏఆర్ఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, బుధవారం స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిందని, సదరు ఎన్నికలు 15 రోజుల్లో ముగియనున్నాయని, కావున విధులు కేటాయించబడిన ఆర్ఓ లు ఏఆర్ఓ లు ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. ఆర్ఓ లు ఏఆర్ఓలకు వార్డులలో ఆర్ఓ ఆఫీస్ లు ఏర్పాటు చేయుట జరిగిందని, కావున ఆర్ఓ లు ప్రతి రోజు అక్కడినుండే విధులు నిర్వహించాలన్నారు.
ఎలక్షన్ షెడ్యుల్ ప్రకారం 16 నుండి 18 వరకు ఉదయం 11 గంటల నుండి మంద్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలని, నామినేషన్లు స్వీకరించే సమయంలోనే నామినేషన్లను పూర్తిగా తనిఖీ చేసుకోవాలని, వచ్చే నామినేషన్లను ప్రతి రోజు డిస్ప్లే బోర్డులో ఏర్పాటు చేయాలన్నారు. 19వ తారీఖు స్క్రూటినీ, 21న నామినేషన్ల ఉపసంహరణ పూర్తైన అనంతరం ఫైనల్ లిస్టులను పబ్లిష్ చేయుట జరుగుతుందన్నారు.
ఆర్ఓ లు వారి వారి డివిజన్లలో (యంసిసి) మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను పక్కాగా అమలు చేయాలని, అధికారులు ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండకుండా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలన్నారు. ఆర్ ఓ లు వారి వారి డివిజన్లలో యంసిసి, ఎఫ్ఎస్టి బృందాల సహాయంతో రాజకీయ పార్టీల వారు ఎన్నికల నిబంధనలు సక్రమంగా పాటించేలా చూడాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకుల ఫోటోలు, బ్యానర్లు, పోస్టర్లు లేకుండా చూడాలన్నారు. డివిజన్లలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి, ఎన్నికల నిబంధనలు వివరించాలన్నారు.
సమావేశంలో అదనపు కమిషనర్లు ఐ. కిషోర్, జి. రవీంద్ర, డి.సిలు బి. శ్రీనివాసరావు, సాంబశివరావు, సి.హెచ్ శ్రీనివాస్, సిటీ ప్లానర్ రాంబాబు, యస్.ఈ జి. వెంకటేశ్వర రావు,డి.సి.పి సూరజ్ కుమార్,మేనేజర్ బాలాజీ బాష, ఎన్నికల విభాగ సూపరిండెంట్ పద్మ, ఆర్ఓలు, ఏఆర్ఓలు పాల్గొన్నారు.




