Guntur: పరామర్శకు వెళితే బంగారు గొలుసు చోరీ కేసు పెట్టారు: మహిళల ధర్నా!
Guntur: చనిపోయిన మహిళను చూసేందుకు వెళితే బంగారపు గొలుసు చోరీ కేసు పెట్టారని ఆరోపిస్తూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట దళిత నేత కంభం ఆనంద్ కుమార్, బాధిత మహిళలు ఆందోళన చేపట్టారు.
Guntur: పరామర్శకు వెళితే బంగారు గొలుసు చోరీ కేసు పెట్టారు: మహిళల ధర్నా!
గుంటూరు: గుంటూరు పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనందపేటలో ఇటీవలే సీయోను కుమారి అనే రిటైర్డ్ స్టాఫ్ నర్స్ మరణించడం జరిగిందని రాష్ట్రీయ మహాజన సమితి వ్యవస్థాపకులు కంభం ఆనంద్ కుమార్ తెలిపారు. మృతురాలును చూసేందుకు చుట్టుప్రక్కల వారు వెళితే మూడు రోజుల తర్వాత విజయవాడలో నివాసం ఉండే దత్త కుమారుడు మృతురాలు సీయోను కుమారి మెడలో ఉండాల్సిన బంగారపు గొలుసు పోయిందని పలువురు మహిళలపై అక్రమ కేసు నమోదు చేసి పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.
పోలీసులు విచారణ పేరుతో పిలిపించి అర్ధరాత్రి 12 వరకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఈ అంశంపై బుధవారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట బాధిత మహిళలతో కలిసి ఆందోళన చేపట్టి, ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో కంభం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ రోజువారి కూలీ పనులు చేసుకునే మహిళలపై అక్రమ కేసులు పెట్టి, విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కి పిలిపించి అర్ధరాత్రి వరకు స్టేషన్లోనే ఉంచి ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. తక్షణమే అమాయక మహిళలపై పెట్టిన అక్రమ కేసును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళలకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదన్నారు. అనంతరం బాధిత మహిళలు మీడియాతో మాట్లాడుతూ తమకు జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు.




