Guntur: ప్రకృతి వ్యవసాయ పుస్తకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్
Guntur: ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో పంటల సంరక్షణ కోసం ప్రకృతి వ్యవసాయ విభాగం రూపొందించిన పుస్తకాన్ని గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ విడుదల చేశారు.
Guntur: ప్రకృతి వ్యవసాయ పుస్తకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్
గుంటూరు: ఎల్ నినో ప్రభావం దృష్ట్యా రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటలను రక్షించుకునే విధానంపై ప్రకృతి వ్యవసాయ విభాగం రూపొందించిన పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉందని ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపై పుస్తకం రూపొందించడం జరిగిందని, దీన్ని రైతులకు చేరవేయాలని అన్నారు.
రైతులు పంటల సంరక్షణ చేసుకునే విధానం తద్వారా ఆర్థికంగా నష్టపోకుండా చూడాలన్నారు. ప్రకృతి సేద్యం విధానంలో పంటల పరిరక్షణ చేసే అవకాశాలను విపులంగా వివరించాలని చెప్పారు. ప్రకృతి సేద్యం విధానంలో పంటల పరిరక్షణకు రైతులు అందరూ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, జిల్లా వ్యవసాయ అధికారి ఎం. పద్మావతి, ప్రకృతి వ్యవసాయం డి.పి.ఎం రాజ కుమారి తదితరులు పాల్గొన్నారు.




