Guntur: మురసు తుఫాను విజృంభణ - ప్రత్తిపాడు, పెదకాకానిలో కలెక్టర్ పర్యటన!
Guntur: మురసు తుఫాను తీవ్రతపై గుంటూరు కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ క్షేత్రస్థాయి పరిశీలన. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పునరావాస కేంద్రాలకు తరలాలని విజ్ఞప్తి.
Guntur: మురసు తుఫాను విజృంభణ - ప్రత్తిపాడు, పెదకాకానిలో కలెక్టర్ పర్యటన!
Guntur: గుంటూరు మురసు తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ మంగళవారం పర్యటించారు. పెదకాకాని, ప్రత్తిపాడు మండలాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు గమనించారు.
రాబోయే 24 గంటలు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పనులు ఉంటే మినహా ఎవరు బయటకు రావద్దన్నారు. లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశాలు, తక్షణం పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రత్తిపాడు, నంబూరు, ఆత్మకూరు లలో పునరావాస కేంద్రాల ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. పునరావాస కేంద్రాలలో చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పునరావాస కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పూరిల్లులు, బాగా తడిసిన ఇల్లులు, శిధిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎవరు ఉండరాదన్నారు. ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. చెరువులు, వాగులు, వంకలు, నది తీరప్రాంతాలకు ఎవరు వెళ్ళరాదన్నారు.
ఎక్కడ ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం గాని, పశువుల నష్టం గాని జరగరాదని స్పష్టం చేశారు. కూలిన చెట్లను, స్తంభాలను త్వరితగతిన తొలగించాలన్నారు. రాకపోకలు, విద్యుత్ పునరుద్ధరణ వెంటనే జరగాలని ఆదేశించారు. మొబైల్ నెట్వర్క్ సమస్య లేకుండా చూడాలని పేర్కొన్నారు.
* ప్రకాశం బ్యారేజి నుండి వరద నీరు వదిలే అవకాశం తద్వారా రాబోయే మూడు రోజుల వరకు ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న తీర ప్రాంత గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని, నది వద్దకు ఎవరు వెళ్ళరాదని కోరారు. నల్లమల గెడ్డ ప్రవాహాన్ని గమనించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




