Guntur: సామూహిక ఎలుకల నియంత్రణ పోస్టర్ విడుదల: కలెక్టర్
Guntur: సామూహిక ఎలుకల నియంత్రణ వ్యవసాయ పోస్టర్‌ను గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ విడుదల చేశారు; రైతు సేవా కేంద్రాల ద్వారా ఉచిత ఎర పంపిణీ చేయనున్నారు.
Guntur: సామూహిక ఎలుకల నియంత్రణ పోస్టర్ విడుదల: కలెక్టర్
గుంటూరు: సామూహిక ఎలుకల నియంత్రణా కార్యక్రమానికి సంబంధించిన వ్యవసాయ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గ్రామాల్లో నిర్వహించాలన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి ఎం.
పద్మావతి మాట్లాడుతూ పొలంలోను, గట్లపైన, పోరంబోకు భూములలో ఉన్న ఎలుక బొరియలన్నింటినీ వాటిలో బ్రోమోడయోలిన్ మందు కలిపిన ఎరను ఒక్కొక్క బొరియలో 10 గ్రామాలు చొప్పున వేసి మూసివేయడం జరుగుతుందన్నారు. ఎలుకల వలన వరి పంటలో 10 నుండి 40 శాతం వరకు నష్టం వాటిల్లుతుందన్నారు.
రైతులు బ్రోమోడయోలిన్ ఎలుకల మందు కలిపిన ఎరను రైతు సేవా కేంద్రాల ద్వారా ఉచితంగా పొందవచ్చని చెప్పారు. సామూహిక ఎలుకల నియంత్రణను చేపడుదాం - వరి పంటను కాపాడుకుందాం నినాదంతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు.




