Guntur: పగడ్బందీగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కలెక్టర్ వర్మ

Guntur: గుంటూరు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపును పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 6 Nov 2026 9:47 PM IST
Guntur
X

Guntur: పగడ్బందీగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కలెక్టర్ వర్మ

గుంటూరు: జడ్పిటిసి, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ సి.యం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపుపై శుక్రవారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మండలానికి సంబంధించి రెండు ఓట్ల లెక్కింపు గదులను ఏర్పాటు చేశామని చెప్పారు.

లెక్కింపు సిబ్బంది సకాలంలో లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని స్పష్టం చేశారు. లెక్కింపు ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు అనుగుణంగా చేయాలని ఆయన ఆదేశించారు. గుంటూరు రెవిన్యూ డివిజన్ కు సంబంధించి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ, తెనాలి రెవిన్యూ డివిజన్ కు సంబంధించి వి ఎస్ ఆర్ కళాశాలలోనూ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ టెలి కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీరమణి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN