Guntur: అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి కలెక్టర్ సాయికాంత్
Guntur: గుంటూరు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను బాధ్యతాయుతంగా, నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశించారు.
Guntur: అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి కలెక్టర్ సాయికాంత్
గుంటూరు: జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతో వచ్చే అర్జీదారుల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సియం. సాయికాంత్ వర్మ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్‌లోని శంకరన్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తో పాటు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, డిప్యుటీ కలెక్టర్ గంగరాజు, డ్వామా పిడి శంకర్ తదితరులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా విచారణ నిర్వహించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడంతో పాటు, పరిష్కారం సాధ్యంకాని అంశాలపై స్పష్టమైన కారణాలను అర్జీదారులకు తెలియజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.




