Tenali: సీఎం పర్యటన ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలి: గుంటూరు కలెక్టర్

Tenali: అక్టోబర్ 4న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పక్కాగా చేయాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Updated on: 29 Sept 2026 4:48 PM IST
Tenali
X

Tenali: సీఎం పర్యటన ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలి: గుంటూరు కలెక్టర్

గుంటూరు జిల్లా: తెనాలి మండలం బుర్రిపాలెంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు మంగళవారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణ పనులకు అక్టోబర్ 4వ తేదీన శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, కేంద్ర

కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ పాల్గొననున్నారని చెప్పారు. హెలిపాడ్ ఏర్పాట్లు, రహదారి మరమ్మతులు, వేదిక నిర్మాణం తదితర అంశాలను పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీరమణి,

రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, ఆర్ అండ్ బి పర్యవేక్షక ఇంజనీర్ ఆర్.శ్రీనివాస మూర్తి, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జె.వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్, తహసిల్దార్ గోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN