Guntur: ఈనెల 27, 28న పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు కలెక్టర్ సాయికాంత్ వర్మ!
Guntur: ఈనెల 27, 28 తేదీల్లో గుంటూరు, తెనాలిలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలు. అధికారులతో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ వీడియో కాన్ఫరెన్స్.
Guntur: ఈనెల 27, 28న పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు: కలెక్టర్ సాయికాంత్ వర్మ!
Guntur: గుంటూరు నగర పాలక సంస్థ, తెనాలి పురపాలక సంఘం పరిధిలో ఈ నెల 27, 28 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, ఆర్.డి.ఓలు, రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులు, రూట్ అధికారులతో శనివారం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అందరికీ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కల్పించాలని స్పష్టం చేశారు. పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ పట్ల ముందస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం జరగరాదని, సామగ్రిలో ఏ ఒక్కటి లేదు అనే మాట ఉండరాదని స్పష్టం చేశారు. పోలింగ్ సామగ్రి స్వీకరణ సైతం ఒక క్రమ పద్ధతిలో చేసి త్వరితగతిన స్ట్రాంగ్ రూమ్ లకు చేరాలని ఆదేశించారు.
ఫోటో ఓటరు స్లీప్ లు పంపిణీ చేయాలి
ఓటర్లకు ఫోటో ఓటరు స్లీప్ లు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
పోలింగ్ కేంద్రంలో వసతులు కల్పించాలి
రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులు, రూట్ అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి ఏ మాత్రం అసౌకర్యం కలుగరాదని అన్నారు. పోలింగ్ కేంద్రం చుట్టు పక్కల పరిశుభ్రత పాటించాలని, మరుగుదొడ్లు ఉండాలని, తాగునీరు, విద్యుత్, ఆహార పంపిణీ అంశాలపై ఎటువంటి లోటుపాట్లు ఉండరాదని అన్నారు. ఎన్ని వాహనాలు కావాలి, ఆయా రూట్ లలో ఎటువంటి వాహనాలు వెళ్లగలవు వంటి అంశాలను ముందుగానే గుర్తించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
26న మైక్రో పరిశీలకుల శిక్షణ
మైక్రో పరిశీలకుల శిక్షణ కార్యక్రమంను ఈ నెల 26న నిర్వహిస్తామని చెప్పారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో గల ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరుగుతుందన్నారు.
గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కె మయూర్ అశోక్ మాట్లాడుతూ గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో 596 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. ఫోటో ఓటరు స్లీప్ లు పంపిణీ ప్రారంభం అయిందని తెలిపారు.
తెనాలి పురపాలక సంఘం కమిషనర్ జె రామ అప్పల నాయుడు మాట్లాడుతూ తెనాలి పురపాలక సంఘం పరిధిలో 185 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 4 జోన్లు, 18 రూట్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. సప్లిమెంటరీ ఓటరు జాబితా వచ్చిందని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులు, రూట్ అధికారులు పాల్గొన్నారు.




