Guntur: గుంటూరు మేయర్ స్థానానికి 19 నామినేషన్లు ఆమోదం.. ఒకటి తిరస్కరణ

Guntur: గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ పదవికి దాఖలైన 20 నామినేషన్లలో స్క్రూట్నీ అనంతరం 19 ఆమోదం పొందగా, 1 తిరస్కరణకు గురైందని కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 19 Oct 2026 7:50 PM IST
Guntur
X

Guntur: గుంటూరు మేయర్ స్థానానికి 19 నామినేషన్లు ఆమోదం.. ఒకటి తిరస్కరణ

గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ ఎలక్షన్స్ అప్ డేట్. మేయర్ అభ్యర్ధులకు దాఖలైన 20 ​నామినేషన్లలో సోమవారం స్క్రూట్నీ అనంతరం 1 రిజెక్ట్ కాగా, 19 అర్హత కల్గినవిగా నిర్ధారణ*

అర్హత పొందిన నామినేషన్లు

టిడిపి : 3​

వైయస్ఆర్సీపీ : 3

బిఎస్పీ : 1

కాంగ్రెస్ : 3

నవరంగ్ కాంగ్రెస్ : 1

నవతరం పార్టీ : 1

రీఫామ్ పార్టీ ఆఫ్ ఇండియా : 1

నవోదయం పార్టీ : 1

​ అమరావతి పార్టీ : 1

స్వతంత్ర అభ్యర్థులు: 4

రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశిత షెడ్యూల్ మేరకు మున్సిపల్ ఎన్నికలు–2026లో భాగంగా నామినేషన్ల స్క్రూట్నీ ప్రక్రియ ముగిసిందని, ఎన్నికల నిబంధనలు, 2005 ప్రకారం అర్హత పొందిన నామినేషన్ల జాబితాను రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ప్రచురించడం జరిగిందని, 21న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం తుది జాబితా ప్రచురణ చేస్తామని నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె.మయూర్ అశోక్ తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN