Guntur: గుంటూరు ఎన్నికలకు ప్రత్యేక "హెల్ప్ డెస్క్"

Guntur: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల కోసం ప్రధాన కార్యాలయంలో ఉదయం 8 నుండి రాత్రి 10 వరకు పనిచేసే ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 19 Oct 2026 7:54 PM IST
Guntur
X

Guntur: గుంటూరు ఎన్నికలకు ప్రత్యేక "హెల్ప్ డెస్క్"

గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ ఎలక్షన్స్ అప్ డేట్. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సాధారణ ఎన్నికల కోసం "హెల్ప్ డెస్క్" ఏర్పాటు!.. అదనపు ఎన్నికల అధికారి & నగర కమిషనర్ కె.మయూర్ అశోక్.

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేకంగా "హెల్ప్ డెస్క్" ఏర్పాటు చేయడం జరిగింది.

నగరపాలక సంస్థ ప్ప్రాంరధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు షిఫ్ట్ ల వారీగా సిబ్బంది అందుబాటులో ఉంటారు.

హెల్ప్ డెస్క్ లో ఎన్నికల ప్రక్రియ, నిబంధనలు మరియు ఇతర సమగ్ర సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చు.

హెల్ప్ డెస్క్ సేవలను సమర్థవంతంగా సమన్వయం చేసేందుకు జిఎంసి పశువైద్యాధికారి డాక్టర్ ఎం. నాగేశ్వరరావు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.

సమర్థవంతమైన ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఈ సేవలను ప్రజలు, రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్న కమిషనర్.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN