Guntur: గుంటూరు బీఆర్ స్టేడియం అభివృద్ధికి శంకుస్థాపన
Guntur: గుంటూరు బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో డ్రైనేజీ, వాకింగ్ ట్రాక్, ఖేలో ఇండియా ఇండోర్ అరీనా పనులకు కమిషనర్ మయూర్ అశోక్, ఎమ్మెల్యే నసీర్ శంకుస్థాపన చేశారు.
Guntur: గుంటూరు బీఆర్ స్టేడియం అభివృద్ధికి శంకుస్థాపన
Guntur: గుంటూరు నగరంలోని బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో శనివారం అభివృద్ధి పనులను వేగంగా చేపట్టనున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అన్నారు. శనివారం బిఆర్ స్టేడియంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మొహమ్మద్ నసీర్ తో కలిసి శంఖుస్థాపన కార్యక్రమం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో కీలకమైన బీఆర్ స్టేడియంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను, వర్షాకాలంలో వాకర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్టేడియం అభివృద్ధి కోసం శాప్ నుంచి రూ.1 కోటి నిధులు మంజూరయ్యాయని, ఆ నిధులతో వాకింగ్ ట్రాక్ రిపేర్లు మరియు ఇండోర్ స్టేడియం పనులు చేపట్టనున్నామని వెల్లడించారు.
దీనికి తోడు జిఎంసి నుండి మౌలిక సదుపాయాల కల్పన కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ హ్యాండ్ మోడల్ (హైబ్రిడ్ అన్యుటీ మోడల్) కింద మంజూరైన నిధులతో బీఆర్ స్టేడియంలో అభివృద్ధి పనులను పూర్తి చేసి, దీనిని అన్ని వసతులతో కూడిన అత్యుత్తమ స్టేడియంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ, గుంటూరు నగరానికి తలమానికమైన బ్రహ్మానంద రెడ్డి స్టేడియం గత పదేళ్లుగా సరైన అభివృద్ధికి నోచుకోక వాకర్స్‌కు, క్రీడాకారులకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. గత ప్రభుత్వాల కాలంలో సరైన నిర్వహణ లేకపోవడం వల్ల వాకింగ్ ట్రాక్‌పై మురికినీరు చేరిందని, ఉన్న బాస్కెట్‌బాల్ కోర్టును కూడా తొలగించారని విమర్శించారు.
అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడాకారుల అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. అందులో భాగంగానే 'ఖేలో ఇండియా' ద్వారా రూ.14 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ అరీనా కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో పాటు శాప్ ద్వారా రూ. 1 కోటి, జిఎంసి ద్వారా రూ.4 కోట్లు కలిపి మొత్తం రూ.5 కోట్ల నిధులతో బీఆర్ స్టేడియంలోని వాకింగ్ ట్రాక్, మంచినీటి వసతి, టాయిలెట్లు, యోగా హాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్ కోర్టులు మరియు జిమ్నాస్టిక్స్ వంటి అన్ని సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.




