Guntur: వారం రోజుల్లో జీఎంసీ షాపుల వేలం: కమిషనర్ మయూర్ అశోక్
Guntur: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఖాళీ షాపులకు వారం రోజుల్లో వేలం వేయాలని కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యానికి ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేశారు.
Guntur: వారం రోజుల్లో జీఎంసీ షాపుల వేలం: కమిషనర్ మయూర్ అశోక్
Guntur: గుంటూరు నగరంలో ఖాళీగా ఉన్న నగర పాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్ లకు వారం రోజుల్లోగా వేలం నిర్వహించి, షాపులను కేటాయించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫెరెన్స్ హాల్లో రెవెన్యూ అధికారులు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశం నందు తొలుత ఆర్ఐ ల వారీగా రెవిన్యూ, విఎల్టీ కలెక్షన్ల వివరాలను అడిగి తెలుసుకొని, కలెక్షన్లు తక్కువగా ఉన్న ఆర్ఐ లు కలెక్షన్లు పెంచాలన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రెవిన్యూ విభాగానికి సంబంధించి ప్రజల నుండి వచ్చే సర్విస్ రిక్వెస్ట్ లు (మ్యుటేషన్, న్యూ టాక్స్, విఎల్టీ) వంటి వాటిని ఎటువంటి ఆలస్యం లేకుండా నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు.
రెవిన్యూ సేవల్లో జాప్యం వహిస్తే అందుకు బాద్యులైన వారి పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వీస్ రిక్వస్ట్ ల పెండింగ్, బియాండ్ ఎస్ఎల్ఏ ఎక్కువ ఉండడం, విధుల్లో నిర్లక్ష్య వైఖరిపై వార్డ్ సచివాలయం నం.3 బిల్ కలెక్టర్ పద్మావతి, వార్డ్ సచివాలయం 17 రెవెన్యూ కార్యదర్శి సుందర్ సింగ్ లను సస్పెండ్ చేసి, చార్జెస్ ఫ్రేం చేసి, వారిపై ఎంక్వయిరీ నిర్వహించాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.
నగర పాలక సంస్థ షాప్ ల బకాయిలను కూడా నూరు శాతం వసూలు చేయాలని, లీజు ముగిసిన షాప్ లకు ఎటువంటి ఆలస్యం లేకుండా వారం రోజులలోపు ఆక్షన్ నిర్వహించి షాపులను కేటాయించాలని అధికారులను ఆదేశించారు. నగర పాలక సంస్థ షాపుల ఆక్షన్లు నిర్వహించుటలో జాప్యం జరిగితే దానికి ఆర్ఓ లు ఆర్ఐ బాధ్యవహించాలన్నారు.
ముఖ్యంగా రెవిన్యూ విభాగానికి సంబంధించి ప్రజల నుండి వచ్చే పిర్యాదులను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, రెవిన్యూ సేవలకు సబంధించి ప్రజల నుండి వచ్చే పిర్యాదులు మరియు సేవలను ఎటువంటి కారణం లేకుండా రిజెక్ట్ చేస్తే సంబంధిత రెవిన్యూ ఇన్స్పెక్టర్ పై చర్యలు తీసుకొనుట జరుగుతుందని ఆర్.ఐ లను హెచ్చరించారు. నగరంలో నూతన టాక్స్ లు విధించాల్సిన అపార్ట్మెంట్లు, లే అవుట్లకు అన్నిటికి నిబంధనల ప్రకారం టాక్స్ విధించాలని, వాటిలో ఎటువంటి తప్పులు లేకుండా అధికారులు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో అదనపు కమిషనర్ ఐ.కిషోర్, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సి.హెచ్.శ్రీనివాస్, జి.సాంబశివరావు, సూపరింటెండెంట్ రవికిరణ్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.




