Tadepalli: తాడేపల్లిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై కత్తితో దాడి

Tadepalli: తాడేపల్లిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కత్తితో బెదిరించి ఫోన్‌పే ద్వారా డబ్బులు దోచుకున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 12 Oct 2026 7:43 PM IST
Tadepalli
X

Tadepalli: తాడేపల్లిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై కత్తితో దాడి

తాడేపల్లి: తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కత్తి, చాకుతో బెదిరించి ఫోన్‌పే ద్వారా రూ.65 వేలు దోచుకున్న కేసులో నలుగురు నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు మైనర్ కాగా, మరో ముగ్గురిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.ఈ సందర్బంగా నార్త్ డి ఎస్పి కె.వెంకటేశ్వర్లులు

మీడియాతో మాట్లాడుతూ నిందితుల నుంచి రూ.50 వేల నగదుతో పాటు నేరానికి ఉపయోగించిన కత్తులు, చాకు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకునట్లు తెలిపారు.

ఈ నెల 6,10 తేదీల్లో జరిగిన ఘటనకు సంబంధించి బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. విశ్రాంతి సమయంలో బయటకు వచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఐదుగురు వ్యక్తులు అడ్డగించి, కత్తితో బెదిరించి ఫోన్‌పే ద్వారా డబ్బులు బదిలీ చేయించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేసు దర్యాప్తులో భాగంగా ఎస్‌ఐ కాజావల్లి, క్రైమ్ టీమ్ సిబ్బంది ప్రసాద్, జోసెఫ్ తదితరులు సాంకేతిక ఆధారాలు, ఫోన్‌పే లావాదేవీలను పరిశీలించి అక్బర్ బాషా,ఇంద్రనీల్, తుమ్మల మహేష్, యశ్వంత్, శివసాయిలను నిందితులుగా గుర్తించారు. వీరిలో నలుగురిని అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, ప్రధాన నిందితుడిగా పేర్కొన్న అక్బర్ బాషాపై గతంలో సుమారు 14 కేసులు ఉండగా, వాటిలో రెండు గంజాయి కేసులు ఉన్నాయి. ఇంద్రనీల్‌పై మూడు కేసులు ఉండగా, వాటిలో గంజాయి కేసులు కూడా ఉన్నట్లు తెలిపారు.

నిందితులు తరచూ నేరాలకు పాల్పడుతున్న నేపథ్యంలో వారిపై సంబంధిత చర్యలు తీసుకుంటామని, అవసరమైన వారికి హిస్టరీ షీట్లు తెరుస్తామని పోలీసులు వెల్లడించారు. ప్రజలు అనుమానాస్పద ఘటనలు లేదా నేరాల సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తాడేపల్లి సీఐ వీరేంద్ర బాబు,ఎస్ ఐ లు ఖాజా వలి, ప్రదీప్ లు సిబ్బంది పాల్గొన్నారు.

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA