Palnadu: బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టుపై వైసీపీ ఫైర్.. రాజకీయ కక్షసాధింపేనన్న కాసు!
Palnadu: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టును తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. వైసీపీ నేతల మద్దతు.
Palnadu: బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టుపై వైసీపీ ఫైర్.. రాజకీయ కక్షసాధింపేనన్న కాసు!
పల్నాడు జిల్లా: నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టును తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. స్వయం కృషితో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి వ్యాపార సామ్రాజ్యాన్ని పల్నాడు ప్రాంతంలో స్థాపించి కొన్ని వేల కుటుంబాలకు ఉపాధి కల్పించిన వ్యక్తి బొల్లా బ్రహ్మనాయుడు.
రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా వినుకొండ ప్రాంతం లో విశేష సేవలు అందించాడు బ్రహ్మనాయుడు. బొల్లా బ్రహ్మనాయుడు కుటుంబాని కి సంబంధించిన వ్యక్తులు మేము కొన్న భూమిలో కొన్ని అవకతవకలు ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకువెళ్తే వాళ్ల మీదే కేసు పెట్టి వాళ్ళని అరెస్టు చేయటం చాలా దారుణం.
ఏపీ మంత్రుల ఒత్తిడిల వల్ల బొల్లా బ్రహ్మనాయుడుని అరెస్టు చేసి ఉండొచ్చు,కచ్చితంగా బొల్లా బ్రహ్మనాయుడు నిర్దోషిగా బయటకు వస్తాడు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ వెనుక తీసి,ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. బొల్లా బ్రహ్మనాయుడు కుటుంబానికి వైసీపీ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది.




