Tadepalli: కేఎల్‌ యూనివర్సిటీ లైబ్రరీలో భారీ అగ్నిప్రమాదం!

Tadepalli: తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్‌ యూనివర్సిటీ లైబ్రరీలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగి ఫర్నిచర్, విలువైన పుస్తకాలు దగ్ధమయ్యాయి.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 2 Oct 2026 7:36 AM IST
Tadepalli
X

Tadepalli: కేఎల్‌ యూనివర్సిటీ లైబ్రరీలో భారీ అగ్నిప్రమాదం!

Tadepalli: తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్యాంపస్‌లోని లైబ్రరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడి ఫర్నిచర్‌, విలువైన పుస్తకాలు, ఇతర సామగ్రి పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నప్పటికీ, అసలు కారణాలు అధికారిక దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ఈ ప్రమాదం నేపథ్యంలో యూనివర్సిటీలోని భద్రతా ప్రమాణాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఫైర్‌ అలారాలు, అగ్నిమాపక పరికరాలు సక్రమంగా పని చేస్తున్నాయా లేదా అనే కోణంలో తనిఖీలు చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర ఎగ్జిట్ మార్గాల లభ్యత, ఇటీవల కాలంలో నిర్వహించిన సేఫ్టీ మాక్‌ డ్రిల్స్‌ వివరాలపై సమగ్ర పరిశీలన జరపాలని పలువురు కోరుతున్నారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి క్యాంపస్‌లోని విద్యుత్‌ వైరింగ్‌ వ్యవస్థ, లోడ్ సామర్థ్యంపై తక్షణమే విద్యుత్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA