Pedakurapadu: పెదకూరపాడు ఎన్నికల నిర్వహణపై నంబూరు శంకరరావు విమర్శలు
Pedakurapadu: పెదకూరపాడు నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు విమర్శలు గుప్పించి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Pedakurapadu: పెదకూరపాడు ఎన్నికల నిర్వహణపై నంబూరు శంకరరావు విమర్శలు
పెదకూరపాడు: పెదకూరపాడు నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ పై మాజీ ఎమ్మెల్యే శంకరరావు ఫైర్. అసంబద్ధంగా జరిగిన ఎన్నికల్లో నిజంగా గెలిచామని చెప్పుకోవడం సిగ్గుచేటు. MPTC,ZPTC ఎన్నికల్లో మా అభ్యర్ధులను నామినేషన్లు వేయనీయలేదు, రౌడీలు,గూండాలను తెచ్చుకుని నామినేషన్లు వేసే వారిని అడ్డుకున్నారు.
ఊటూకూరు లో జరిగిన ZPTC ఎన్నికల్లో కూటమికి ఓట్లు పడలేదు, ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరిపితే కూటమి ఘోరంగా ఓడిపోతుంది, దొడ్డిదారిన కూటమి అభ్యర్థులను గెలిపించే పనిలో ఎమ్మెల్యే ప్రవీణ్ ఉన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. నామినేషన్ కేంద్రాలు తమ కనుసన్నల్లో ఉండేవిధంగా కూటమి నాయకులు రెడీ చేసుకుంటున్నారు. దీనిపై ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేశాం... ఎమ్మెల్యే నంబూరు శంకరరావు.




