Chilakaluripet: ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కావద్దు!

Chilakaluripet: చిలకలూరిపేటలో రూ.1.45 కోట్లతో పునర్నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించిన మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 8 Oct 2026 4:10 PM IST
Chilakaluripet
X

Chilakaluripet: ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కావద్దు!

Chilakaluripet: చిలకలూరిపేటలో రూ.1.45 కోట్లతో అర్బన్ హెల్త్ సెంటర్ పునర్నిర్మాణం చేసిన మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలుకావద్దని.. ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఆసుపత్రులు, వైద్యుల పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రతిరోజూ ర్యాంకింగ్స్ ఇస్తున్నారని వెల్లడి.

పారిశుధ్య నిర్వహణలో చిలకలూరిపేట మున్సిపాలిటీకి బెస్ట్ అవార్డు రావడంపై ప్రత్తిపాటి హర్షం. పట్టణాభివృద్ధిలో భాగంగా రూ.52 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల నిర్మాణానికి టెండర్లు. కూటమి ప్రభుత్వంతో రాష్ట్రంలో అభివృద్ధి మళ్లీ వేగం పుంజుకుందని వ్యాఖ్య.

మోదీ, చంద్రబాబు, పవన్, లోకేష్‌ల కృషితో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని వెల్లడి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులదే నూరు శాతం విజయమని ప్రత్తిపాటి ధీమా.

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA