Guntur: సంగం డెయిరీ నూతన ఉత్పత్తులను ఆవిష్కరించిన ధూళిపాళ్ల!
Guntur: గుంటూరు జిల్లా వడ్లమూడి సంగం డెయిరీలో నూతన భవనాలు, ఇన్స్టెంట్ ఇడ్లీ పిండి ఉత్పత్తులను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్.
Guntur: సంగం డెయిరీ నూతన ఉత్పత్తులను ఆవిష్కరించిన ధూళిపాళ్ల!
గుంటూరు: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సంగం డైరీ లో మంగళవారం నూతనంగా నిర్మించిన భవనాలను, మల్టీ గ్రైన్ ఇన్స్టెంట్ ఇడ్లీ పిండిలో రెండు రకాలను ధూళిపాళ్ల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా సంగం డైరీ నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తుందన్నారు.
సంగం డైరీ తయారుచేసిన మల్టీ గ్రైన్, ప్రోటీన్ తో కూడిన ఇన్స్టెంట్ ఇడ్లీ పిండిని వినియోగదారులు ఆదరించాలన్నారు. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడానికి సంగం డైరీ నిరంతరం ప్రయోగాలు చేస్తుందన్నారు.




