Dachepalli: దాచేపల్లిలో ప్రైవేట్ పాఠశాల బస్సులను తనిఖీ చేసిన సీఐ!

Dachepalli: పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దాచేపల్లిలో ప్రైవేట్ పాఠశాల బస్సులను సీఐ ఖాజావలి తనిఖీ చేసి, పత్రాలను పరిశీలించి డ్రైవర్లకు పలు భద్రతా సూచనలు జేశారు.

SK SAIDA, GURAJALA
Published on: 1 Oct 2026 8:22 AM IST
Dachepalli
X

Dachepalli: దాచేపల్లిలో ప్రైవేట్ పాఠశాల బస్సులను తనిఖీ చేసిన సీఐ!

Dachepalli: పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఆదహళ్లి గారి ఆదేశాల మేరకు దాచేపల్లి మండల పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సులపై దాచేపల్లి సీఐ ఖాజావలి ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

దాచేపల్లి మార్కెట్ యార్డులో పాఠశాల బస్సులను తనిఖీ చేసి, బస్సుల కండిషన్, డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ఇతర అవసరమైన ధ్రువపత్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై సీఐ పలు సూచనలు చేశారు. విద్యార్థులను సురక్షితంగా పాఠశాలకు తీసుకెళ్లడం, నిర్ణీత వేగ పరిమితులను పాటించడం, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించడం, డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అలాగే బస్సుల కండిషన్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని, ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని తెలిపారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఐ ఖాజావలి సూచించారు.

SK SAIDA, GURAJALA

SK SAIDA, GURAJALA