Guntur: గుంటూరు 46వ డివిజన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రచారం!

Guntur: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ సీపీఐ అభ్యర్థి ఓలేటి సుశీలను కంకి-కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య కోరారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 26 Oct 2026 11:35 AM IST
Guntur
X

Guntur: గుంటూరు 46వ డివిజన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రచారం!

Guntur: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 46వ డివిజన్ నుండి పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థి ఓలేటి సుశీల ను కంకి - కొడవలి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య కోరారు.

సోమవారం వార్డులో ఈశ్వరయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉండవలసిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఏ అవసరం ఉన్న వారి పక్షాన నిలబడేది కమ్యూనిస్టులే అన్నారు. కమ్యూనిస్టు పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN