Sattenapalli: సత్తెనపల్లిలో భారీ కార్డెన్ సెర్చ్ పత్రాలు లేని వాహనాల సీజ్!
Sattenapalli: సత్తెనపల్లిలోని నిర్మలానగర్‌లో పోలీసుల భారీ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్. సరైన పత్రాలు లేని 40 బైక్‌లు, ఒక ఆటో స్వాధీనం. రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరిక.
Sattenapalli: సత్తెనపల్లిలో భారీ కార్డెన్ సెర్చ్ పత్రాలు లేని వాహనాల సీజ్!
Sattenapalli: సత్తెనపల్లిలోని నిర్మలానగర్‌లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ ఉక్కుపాదం మోపింది. ఐజీ మరియు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ ఎం.వి .కె చైతన్య ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులతో భారీ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించేలా ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా,గొడవలుసృష్టించినా , ఉపేక్షించేది లేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ తక్షణమే రౌడీషీట్లు తెరుస్తామని డీఎస్పీ హెచ్చరించారు.
ఈ ఆపరేషన్‌లో టౌన్ సీఐ CH ప్రభాకర్, రూరల్ సీఐ, సర్కిల్ సీఐలు రాంబాబు, కిరణ్ ,సబ్ డివిజన్ సీఐ లు ఎస్ ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.




