Mangalagiri: నామినేషన్లు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించండి: సీఐ వీరాస్వామి

Mangalagiri: మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్లు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని, 120 మందిని బైండోవర్ చేశామని మంగళగిరి సీఐ వీరాస్వామి తెలిపారు.

MALLESHWAR RAO, MANGALAGIRI
Published on: 14 Nov 2026 3:00 PM IST
Mangalagiri
X

Mangalagiri: నామినేషన్లు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించండి: సీఐ వీరాస్వామి

మంగళగిరి: మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

నామినేషన్ల దాఖలు ప్రశాంతంగా జరిగేందుకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద గౌతమ బుద్ధా రోడ్డులో రెండు చోట్ల కటాఫ్ (భద్రతా నియంత్రణలు) ఏర్పాటు చేసినట్లు మంగళగిరి టౌన్ సీఐ వీరాస్వామి తెలిపారు.

నిబంధనల ప్రకారం, నామినేషన్ వేసేందుకు లోపలికి కేవలం ఒక అభ్యర్థిని, ఒక ప్రతిపాదకుడిని (ప్రపోజర్) మాత్రమే అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు.

అలాగే, మంగళగిరి పరిధిలో ఆరు సమస్యాత్మక డివిజన్లను గుర్తించామని సీఐ వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ముందుజాగ్రత్త చర్యగా ఇప్పటివరకు సుమారు 50 మంది రౌడీ షీటర్లు, 70 మంది అల్లరి మూకలను (ట్రబుల్ మాంగర్స్) బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఈ బైండోవర్ ప్రక్రియ ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

MALLESHWAR RAO, MANGALAGIRI

MALLESHWAR RAO, MANGALAGIRI