Guntur: గుంటూరు కలెక్టరేట్‌లో అధికారులతో ఎన్నికల సన్నాహాలపై సమీక్ష!
Guntur: స్థానిక సంస్థల ఎన్నికల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ సిద్ధంగా ఉండాలని అధికారులను కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ ఆదేశించారు.
Guntur: గుంటూరు కలెక్టరేట్‌లో అధికారులతో ఎన్నికల సన్నాహాలపై సమీక్ష!
Guntur: స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తాజాపరుస్తూ సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు. మునిసిపల్ కమిషనర్లు జిల్లా పంచాయతీ అధికారి తదితరులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల వివరాలు పై చర్చించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ స్టేషన్ల వివరాలు సిద్ధం చేయడం జరిగిందని అదే రీతిలో మునిసిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో సిద్ధం చేసి ఉంచాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న ఆదేశాలను, మార్గదర్శకాలను పాటించాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, తెనాలి మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.




