Guntur: గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) తాత్కాలిక రద్దు!

Guntur: ఎన్నికల విధులు, కోడ్ అమలులో ఉన్నందున గుంటూరు జిల్లాలో పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 29 Nov 2026 2:14 PM IST
Guntur
X

Guntur: గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) తాత్కాలిక రద్దు!

Guntur: ఎన్నికల విధులలో జిల్లా యంత్రాంగం నిమగ్నం కావడం వలన మరియు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటం వలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు.

ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పూర్తి అయ్యేవరకు పి.జి.ఆర్.ఎస్ ను రద్దు చేయడం జరిగిందని చెప్పారు. ఈ అంశాన్ని ప్రజలు గమనించి సోమవారం వ్యయప్రయాసలకు ఓర్చి రావద్దని విజ్ఞప్తి చేశారు

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN