Kavuripalem: కావూరిపాలెంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
Kavuripalem: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో చీరాల మండలం కావూరిపాలెం ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు.
Kavuripalem: కావూరిపాలెంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
కావూరిపాలెం: కావూరి పాలెం గ్రామం లో ఉన్న ప్రాథమిక పాఠశాల లో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా నవంబర్ 3న జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి చీరాల మండలం కావూరిపాలెం గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, సోమవారం రాత్రి పరిశీలించారు.
చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారిణితో కలిసి కలెక్టర్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు.
పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఎన్నికల సిబ్బందికి కల్పించాల్సిన సౌకర్యాలు, పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.




