Inkollu: ఇంకొల్లులో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్!
Inkollu: ఇంకొల్లు మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. ఎస్ఎస్టీ తనిఖీల పరిశీలన.
Inkollu: ఇంకొల్లులో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్!
ఇంకొల్లు: జిల్లాలో జడ్పీటీసీ, యం పి టి సి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.,వి.పేర్కొన్నారు.
జిల్లాలో నవంబర్ 3 న జరగనున్న జడ్పీటీసీ, యం పి టిసి ఎన్నికల నేపథ్యంలో బాగంగా గురువారం ఇంకొల్లు మండల పరిషత్ కార్యాలయంలో ఎం.పీ.టీ.సీ. స్థానాలకు వేస్తున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మరియు పోలింగ్ కేంద్రాలకు జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జిల్లా పరిషత్ ఎన్నికలు ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో నవంబర్ 3 న జరగనున్న జడ్పీటీసీ, యం పి టి సి ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు కు పావులూరు గ్రామం లోని జిల్లా పఫిషత్ ఉన్నత పాఠశాల లో ను మరియు స్వర్ణ గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు జిల్లా కలెక్టర్ పరిశీలించారు.జిల్లాలో జిల్లా పరిషత్ ఎన్నికలు ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, ఓటర్లు సౌకర్యవంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకుకల్పించాల్సిన సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయం వద్ద ఉన్న గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీకు ఓటు ఉందా,మీరు ఓటర్ జాబితాలో మీపేరు ఉందని చూచుకున్నారా,మీరు ఎక్కడ ఓటు వేస్తారని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పందిళ్ళ పల్లె పంచాయతీ పరిధిలో మార్కెట్ చెక్ పోస్టు వద్ద హైవే లో ఎస్ ఎస్ టి టీం నిర్వహిస్తున్న తనిఖీ ని జిల్లా కలెక్టర్ పరిశీలించి హై వేలో వస్తున్న వాహన దారులతో మీరు ఎక్కడ నుండి వస్తున్నారు.ఎక్కడికి వెళుతున్నారు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి,మీకు ఎక్కడ ఓటు ఉంది,మీరు ఓటర్ జాబితాలో చూచుకున్నారా,ఎన్నికల సందర్భంగా ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉన్నాయని వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్ ఎస్ టి టీమ్ ద్వారా వీడియో తీయిస్తున్నారాని అడిగి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహశీల్దార్ శ్రీనివాసులు, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.




