Guntur: 'మా-ఏపి' సినిమా డైరీ విడుదల చేసిన కలెక్టర్ సాయికాంత్ వర్మ!
Guntur: గుంటూరు కలెక్టరేట్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సినిమా డైరీని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ గురువారం విడుదల చేశారు.
Guntur: 'మా-ఏపి' సినిమా డైరీ విడుదల చేసిన కలెక్టర్ సాయికాంత్ వర్మ!
Guntur: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ ( మా-ఏపి) సినిమా డైరీ ను గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ గురువారం కలెక్టర్ కార్యాలయంలో విదుదల చేశారు. టాలీవుడ్ దర్శకుడు, మా ఏపి' వ్యవస్థాపకులు దిలీప్ రాజా అధ్వర్యంలో జరిగిన కార్యక్రమoలో మా' ఏపిలో సభ్యత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ సినీ నటినటులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలో మా ఏపీ ప్రధాన కార్యాలయం 2018 నుండి 587 సభ్యులతో పని చేస్తున్న నేపధ్యంలో అదే జిల్లా కలెక్టర్ ద్వారా మా ఏపి సినిమా డైరీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు దిలీప్ రాజా చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ఔత్సాహిక కళాకారుల డైరీను సినీ పరిశ్రమలో కొందరు ప్రముఖులకు అందజేస్తామని ఆయన తెలిపారు. తద్వారా ఆంధ్రకు చెందిన నిర్మాత దర్శకుల ముంగిట్లోకి మా' ఏపి డైరీ చేరుతుందన్నారు.
డైరీ లోని నటీనటులకు ఉజ్వల భవిష్యత్తు రావాలని ఆశిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారని దిలీప్ రాజా వివరించారు. కార్యక్రమంలో విజయనగరం రామకృష్ణ, భవానీ కపూర్, సముద్రాల, రమేష్ వర్మ, వారణాసి పాత్రుడు, వీరoకి లక్ష్మి, వంశీ, తుమ్మా పాపారావు, స్వామి, సైదులు యాదవ్, యర్రబాబు తదితరులు పాల్గొన్నారు.




