Guntur: మహాత్ముని బాటలో కూటమి పాలన: ఎమ్మెల్యే నసీర్ అహ్మద్
Guntur: గాంధీజీ కలలుగన్న స్వరాజ్య సాధనే లక్ష్యంగా కూటమి పాలన సాగుతోందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. నగరంలో శాంతి ర్యాలీని ఘనంగా నిర్వహించారు.
Guntur: మహాత్ముని బాటలో కూటమి పాలన: ఎమ్మెల్యే నసీర్ అహ్మద్
Guntur: జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలే ప్రజలకు మంచి పాలన అందిస్తోందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక తూర్పు కార్యాలయంలో మహాత్ముని చిత్రపటానికి ఎమ్మెల్యే నసీర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మా గాంధీ జీవితం అందరికీ ఆదర్శనీయమని చెప్పారు.
సత్యం, అహింస అనే రెండు బలమైన ఆయుధాలతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహానీయుడు గాంధీజీ అని కొనియాడారు. నేటి యువత చెడు మార్గాలను విడనాడి, గాంధీజీ చూపిన శాంతి మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు.
సమాజంలో శాంతిభద్రతలు పరిఢవిల్లాలంటే ప్రతి ఒక్కరూ అహింసా మార్గాన్ని అలవర్చుకోవాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యసాధనకై ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని తెలిపారు.
ఘనంగా శాంతి ర్యాలీ
గాంధీ జయంతి సందర్భంగా గుంటూరు నగరంలో అహింస, శాంతి సందేశాన్ని చాటిచెప్పేలా ఘనంగా శాంతి ర్యాలీ నిర్వహించారు. హిమని సర్కిల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఎమ్మెల్యే నసీర్ ముఖ్య అతిథిగా విచ్చేసి, భారీ సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. అనంతరం అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.




