Vinukonda: సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దు.. సీఐ!

Vinukonda: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా వదంతులను నమ్మవద్దని వినుకొండ పట్టణ సీఐ ప్రభాకర్ కోరారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 15 Nov 2026 7:19 AM IST
Vinukonda
X

Vinukonda: సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దు.. సీఐ!

Vinukonda: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి అపోహలకు, వదంతులకు గురికావద్దని వినుకొండ పట్టణ సీఐ ప్రభాకర్ సూచించారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరూ ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.

నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఎవరైనా బెదిరింపులకు గురిచేసినా, ఇబ్బందులు కలిగించినా తమ దృష్టికి తీసుకువస్తే తగిన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ అల్లర్లు సృష్టించే వ్యక్తులపై పోలీసు శాఖ తరఫున ముందస్తు చర్యలు తీసుకుంటామని, అవసరమైన వారిని బైండోవర్ చేస్తామని తెలిపారు.

అయితే ఈ చర్యలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, పోలీసులు కొందరిని లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తున్నారంటూ లేనిపోని అపోహలు సృష్టించడం సరికాదన్నారు.

సోషల్ మీడియాలో వచ్చే నిరాధారమైన వార్తలు, వదంతులను ప్రజలు ఎవరూ నమ్మవద్దని, వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని కోరారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని సీఐ ప్రభాకర్ స్పష్టం చేశారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA