Chirala: వైయస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహణ

Chirala: చీరాలలో వైయస్సార్‌సీపీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం. స్థానిక ఎన్నికల సన్నద్ధతపై నాయకులకు దిశానిర్దేశం.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 17 Sept 2026 9:34 AM IST
Chirala
X

Chirala: వైయస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహణ

చీరాల: చీరాల మండలం రామకృష్ణాపురం క్యాంపు కార్యాలయం నందు చీరాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో ముందుగా కరణం వెంకటేష్ బాబు పార్టీ నాయకులకు ఐడీ కార్డులను అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో నాయకులందరూ ఇప్పటి నుంచే ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి నాయకుడు తన పరిధిలో పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించాలని,ఎన్నికల సమయానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని కరణం వెంకటేష్ బాబు గారు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి నియోజకవర్గ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు,మండల పార్టీ అధ్యక్షులు,పట్టణ పార్టీ అధ్యక్షులు,గ్రామ పార్టీ అధ్యక్షులు,వార్డు పార్టీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala