Bapatla: చీరాల ఓటర్ల జాబితాలో అసమానతలు: కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత!
Bapatla: చీరాల మున్సిపాలిటీలో 44 వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాలో నెలకొన్న అసమానతలను సరిచేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేత.
Bapatla: చీరాల ఓటర్ల జాబితాలో అసమానతలు: కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత!
Bapatla: చీరాల మున్సిపాలిటీలో పునర్విభజన అనంతరం రూపొందించిన 44 వార్డుల హద్దులు, ఓటర్ల జాబితాలో కనిపిస్తున్న అసమానతలు, మార్పులు, చేర్పులను సమగ్రంగా పరిశీలించి సరిచేయాలని కోరుతూ శనివారం
బాపట్ల జిల్లా కలెక్టరు & డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ డాక్టర్ వినోద్ కుమార్ కి చీరాల మున్సిపల్ కమిషనర్ & అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ డానియేలు జోసెఫ్ ను కలసి వినతిపత్రం సమర్పించారు.
చీరాల మున్సిపాలిటీలో గతంలో 33 వార్డులు ఉండగా, జనాభా పెరుగుదల మరియు పరిపాలనా అవసరాల నేపథ్యంలో ప్రస్తుతం 44 వార్డులుగా పునర్విభజన జరిగింది. ఈ నూతన వార్డు హద్దుల ఆధారంగా రూపొందించిన ఓటర్ల జాబితాను పరిశీలించినప్పుడు,
కొన్ని ప్రాంతాల్లో వాస్తవంగా ఒక వార్డులో నివసిస్తున్న ఓటర్ల పేర్లు ఇతర వార్డుల జాబితాల్లో నమోదైనట్లు, అలాగే ఇతర వార్డు పరిధిలో నివసిస్తున్న కొంతమంది ఓటర్లు సంబంధిత వార్డు జాబితాలో నమోదైనట్లు గుర్తించినట్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
ప్రత్యేకంగా “మా వార్డులో నివసిస్తూ బయట వార్డుకు వెళ్లిన ఓటర్లు”, “బయట వార్డులో నివసిస్తూ మా వార్డులో నమోదైన ఓటర్లు” అనే రెండు విభాగాలుగా వివరాలను గుర్తించి, అవసరమైన ఆధారాలతో అధికారులకు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
అలాగే ఒకే వీధి లేదా ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాలు వేర్వేరు వార్డుల్లోకి వెళ్లిన సందర్భాలను కూడా పరిశీలించాలని కోరారు. వార్డు హద్దులు, వీధులు, ఇళ్ల వివరాలు, ఓటర్ల జాబితాను పరస్పరం సమన్వయం చేసి పరిశీలించడం ద్వారా ఇలాంటి సమస్యలను గుర్తించవచ్చని తెలిపారు.
వాస్తవ నివాస ప్రాంతానికి అనుగుణంగా ప్రతి ఓటరు పేరు సరైన వార్డు పరిధిలోనే నమోదైందా లేదా అనే అంశంపై అవసరమైన చోట క్షేత్రస్థాయి పరిశీలన, ఇంటింటి ధృవీకరణ చేపట్టాలని కోరారు.
అభ్యంతరాలు ఉన్న ఓటర్లకు నిబంధనల ప్రకారం తమ అభ్యంతరాలను సమర్పించే అవకాశం కల్పించి, వాటిని సమగ్రంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తుది ఓటర్ల జాబితా ప్రకటించే ముందు వార్డు హద్దులు మరియు వాస్తవ నివాస ప్రాంతాలకు అనుగుణంగా అవసరమైన సవరణలు చేపట్టాలని కోరారు.
తద్వారా భవిష్యత్తులో ఓటర్లకు ఇబ్బందులు లేకుండా, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కొనసాగుతుందని పేర్కొన్నారు. పాపిశెట్టి సురేష్,దాసరి శ్రీను, షేక్ సిరాజ్, కనపర్తి బజ్జి బాబు, దేవరపల్లి బాబారావు,నూనె చంద్ర , గుండాల వసంత రావు, మేరుగ ఇస్సాకు,షేక్ రహిమాన్,
కాగిత కిషోర్,భట్టిప్రోలు శంకర్,దుడ్డు కోటేశ్వరరావు, కుంచాల రాంబాబు, బడుగు సువర్ణ రాజ్,చదలవాడ మాధవరావు, చెంబేటి చంద్ర,ఎస్ డి. షరీఫ్, విన్నకోట రాజేంద్ర.ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.




