Chirala: చీరాలలో టీడీపీకి షాక్.. వైఎస్సార్సీపీలో చేరిన లావేటి తేజ!
Chirala: చీరాలలో టీడీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లావేటి తేజ వైఎస్సార్సీపీలో చేరారు. కరణం వెంకటేష్ బాబు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
Chirala: చీరాలలో టీడీపీకి షాక్.. వైఎస్సార్సీపీలో చేరిన లావేటి తేజ!
చీరాల: చీరాల నియోజకవర్గ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ చీరాల నియోజకవర్గ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న యువ నాయకుడు లావేటి తేజ ఆ పార్టీని వీడి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
చీరాల రామకృష్ణాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజకవర్గ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు సమక్షంలో లావేటి తేజ వైకాపా కండువా కప్పుకుని పార్టీలోకి అధికారికంగా ప్రవేశించారు.
ఈ సందర్భంగా కరణం వెంకటేష్ బాబు లావేటి తేజను పార్టీలోకి సాగర్ధ్వగంగా ఆహ్వానిస్తూ, ఆయన రాకతో నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి, బీసీ వర్గాల అభ్యున్నతికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని లావేటి తేజకు శుభాకాంక్షలు తెలిపారు.




