Chirala: హెచ్‌ఏఎం మోడల్ ద్వారా రూ.30 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
Chirala: చీరాలలో హెచ్‌ఏఎం పథకం ద్వారా రూ.30 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు, పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య.
Chirala: హెచ్‌ఏఎం మోడల్ ద్వారా రూ.30 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
చీరాల: పట్టణ స్థానిక సంస్థలపై భారాన్ని మోపకుండా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) 26 జిల్లాలు, 106 నియోజకవర్గాల్లోని 123 మునిసిపాలిటీల్లో రూ.11359 కోట్ల తో వివిధ రకాల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు HAM మోడల్ లో తొలి సారిగా ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా చీరాల మున్సిపాలిటీ లో రూ.30 కోట్లు తో వివిధ రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం.
ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా,చీరాల మున్సిపాలిటీ నందు ఓపెన్ హల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ముద్దులూరి మాల కొండయ్య తో కలసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
చీరాల మున్సిపాలిటీ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చీరాల శాసనసభ్యులు ఎం.ఎం.కొండయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ. నారా చంద్రబాబు నాయుడు కి వివరించారు. హెచ్ ఏ ఎం (హైబ్రిడ్ యాన్యూటీ మోడల్) పథకం ద్వారా పట్టణ ప్రాంతాలలో చేపడుతున్న మౌళిక సదుపాయాల కల్పన అభివృద్ధి పనులను కుప్పం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో మంగళవారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో చీరాల శాసనసభ్యులు ఎం ఎం కొండయ్య రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడారు. చీరాల మున్సిపాలిటీ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి హాజరయ్యారు.
చీరాల చరిత్రలోనే పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు ఇంతవరకు జరగలేదని చీరాల శాసనసభ్యులు ఎం ఎం కొండయ్య చెప్పారు. ఇప్పటికే 80 పనులు పూర్తి చేశామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక, డి ఎం ఎఫ్ నిధులు కలిపి రూ.34.83 కోట్లతో పనులు కొనసాగుతున్నాయన్నారు.
నూతనంగా ప్రవేశపెట్టిన హెచ్ ఏ ఎం పథకం కింద రూ.144 కోట్లు చీరలకు కేటాయించడం సంతోషదాయకమన్నారు. పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో చీరాల వాసులంతా రాష్ట్ర ముఖ్యమంత్రి కి రుణపడి ఉన్నామన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో మురిగినీటి వ్యవస్థ నిర్మాణం, రహదారులపై డివైడర్లు, పార్కులు, వీధి విద్యుత్ దీపాలు, పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఉమ్మడి జిల్లా కింద ఉన్న సమయంలో వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మించగా ఇప్పుడు ఆ నీటిని చూసి జిల్లా ప్రజలంతా ఎంతో ఆనందిస్తున్నారన్నారు. అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అభినందించారు. 139 సిమెంట్ రోడ్డు పనులు, 8.26 కిలోమీటర్ల మేర వీధి విద్యుత్ దీపాలు, పార్కులు, తాగునీటి సమస్య పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కి శాసనసభ్యులు వివరించారు.
ఈ కార్యక్రమంలో చీరాల ఆర్డీవో నరసింహారావు, చీరాల మున్సిపల్ కమిషనర్ జోసెఫ్ డేనియల్, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




